ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత తగ్గుతోంది. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన చలిగాలులు మళ్లీ పెరిగాయి. రానున్న వారం రోజులు మరింత పెరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది. చలి కారణంగా ఉదయం 9 గంటల వరకూ లేదా సాయంత్రం 6 దాటాక బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి గాలులు, చలి తీవ్రతపై వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న వారం రోజుల్లో రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగనుందని సూచించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగిపోయింది. అటు పగటి ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారుతోంది. తెలంగాణలో అదిలాబాద్, భద్రాచలం ప్రాంతాల్లోనూ, ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికమైంది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంటోంది. రానున్న వారం రోజులు ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా చలి పెరిగిపోయింది. రెండ్రోజుల్నించి పరిస్థితి మరింత పడిపోయింది. చలికాలంగా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో చలితీవ్రత మరింత పెరగవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో హై అలర్ట్ జారీ అయింది. కొమురం భీమ్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదిలాబాద్ జిల్లాల్లో నిన్న కనిష్టంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా నల్గొండలో 17 డిగ్రీలు నమోదైంది. ఇక ఖమ్మంలో 16.6 డిగ్రీలు, భద్రాచలంలో 16.5 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 16.4, నిజామాబాద్ జిల్లాలో 14.4 డిగ్రీలు, దుండిగల్‌లో 13.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13.6 డిగ్రీలు, హన్మకొండలో 13 డిగ్రీలు, రామగుండంలో 12.8 డిగ్రీలు, పఠాన్ చెరువులో 8.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 10 డిగ్రీలు నమోదైంది
CHILL TEMPERATURE WARMING WEATHER ALERT
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి, వచ్చే 3 రోజులు 4-5 డిగ్రీలకు ఉష్ణోగ్రతTelangana Weather Forecast for coming 3 days intense cold waves alert ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా చలి ప్రతాపం చూపిస్తోంది
और पढो »
ఆదిలాబాద్‌లో పాఠశాల సమయం మార్పుఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత వల్ల పాఠశాలల సమయాలు మారి ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు మార్పు జరుగుతోంది.
और पढो »
Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.
और पढो »
SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ఏపీ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్ధులకు తత్కాల్ పథకం ద్వారా మరో అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించవచ్చు.
और पढो »
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. వాతావరణ శాఖ జాగ్రత్త హెచ్చరించింది.
और पढो »
అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పాడంటే దాడి చేసి.. యువకుడు ఆత్మహత్యతెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పడంతో యువకుడిపై దాడి జరిగి ఆత్మహత్యకు దిగింది.
और पढो »