Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
ketu guru gochar 2024: కేతు, గురు గోచారం.. ఈ మూడు రాశులకు గొప్ప అదృష్టం.. మీరున్నారా..?
Mohan Babu - Balakrishna: అవును గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టు.. ఏ సినిమా ఎవరు చేయాలన్నది ముందే డిసైడ్ అవుతుందని కొంత మంది విషయాల్లో అది ప్రూవ్ అవుతూనే ఉంది. అలా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీతో మోహన్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు స్టార్ హీరో అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన 'చిత్రం' సినిమా స్టోరీ ముందుగా బాలయ్య దగ్గరకు వచ్చింది. కథ అంతా విన్నాకా.. చివర్లో హీరో పాత్ర ఉరిశిక్ష విధిస్తారనే దానిపై బాలయ్య సందిగ్ధంలో పడ్డారట.
ఆ తర్వాత అదే కథను పరుచూరి సోదరులు మోహన్ బాబుకు వినిపించారు. ఆయన ఇంప్రెస్ అయి.. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'చిత్రం' సినిమా చూసారు. ఆ కథను పట్టుకెళ్లి కే.రాఘవేంద్రరావుకు చెప్పారు. అంతకు ముందే దర్శకేంద్రుడు..మోహన్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అప్పటికే కే.రాఘవేంద్రరావు .. చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటికే మోహన్ బాబు హీరోగా అంతగా ఫామ్‌లో లేడు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా చేస్తోన్న టైమ్ అది.
ఆ టైమ్‌లో మోహన్ బాబుతో కే.రాఘవేంద్రరావు సినిమా అనగానే సినీ ఇండస్ట్రీలో వద్దన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కానీ కే.రాఘవేంద్రరావు.. మోహన్ బాబు నిర్మాణంలో ఆయనే హీరోగా శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై 'అల్లుడు గారు' సినిమాను తెరకెక్కించారు. కేవలం 32 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసారు దర్శకేంద్రుడు. శోభన, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 28 సెప్టెంబర్ 1990న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు పలు కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు పరుగును పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు కే.వి.మహదేవన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ రకంగా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీతో మోహన్ బాబు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అల్లుడుగారు తర్వాత మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం వంటి వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోగా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Mohan Babu Balarkrishna NBK Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hindupur: హిందూపూర్ లో బాలయ్య కు పరిపూర్ణానంద స్వామి సెగ.. బాలకృష్ణకు ఓటమి తప్పదా.. ?Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య.
और पढो »
Allari Naresh old Titles Repeat: ఆ ఒక్కటి అడక్కు సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..Allari Naresh old Titles Repeat: తెలుగులో ఓల్డ్ టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా అల్లరి నరేష్ కూడా పాత సూపర్ హిట్ సినిమాలతో తన మూవీలకు హైప్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు. తాజాగా ఒకప్పటి బ్లాక్ బస్టర్ ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
और पढो »
Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
और पढो »
Tillu Cube: టిల్లు క్యూబ్ కోసం మరో దర్శకుడు.. ప్రతి పార్ట్ కి కొత్తదనం కోరుకుంటున్న సిద్దు..Tillu Square Sequel: డిజె టిల్లు సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
और पढो »
Akhanda 2: అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. సినిమా అప్పటివరకు లేదట!Balakrishna: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంతటి విజయాలు సాధించాయి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం సీక్వెల్ గురించి బోయపాటి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి..
और पढो »
Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
और पढो »