CM Revanth reddy: తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్‌ఎస్ వాదిస్తోంది..
CM Revanth Reddy : తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్‌ఎస్ వాదిస్తోంది..! ఇంతకీ తెలంగాణ సెక్రటేరియట్‌లో మార్పులెందుకు చేస్తున్నారు.ICICI Prudential Blue Chip Fundతెలంగాణ సెక్రటేరియట్‌లో కొద్దిరోజులుగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరో ప్లోర్‌లో సీఎం చాంబర్ ఉండేది.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే సీఎం చాంబర్‌ను ఏడో ప్లోర్‌కు మార్చేశారు. అలాగే కేసీఆర్ ఈస్ట్ గేట్ వైపు గుండా సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అదే గేటు గుండా బయటకు వెళ్లేవారు. కానీ రేవంత్ రెడ్డి ఇందులోనూ మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్‌లో ప్రధానగేటును రేవంత్ సర్కార్ మూసి వేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. సెక్రటేరియట్‌లో లుంబిని పార్కుకు ఎదురుగా బాహుబలి గేట్‌ను పెట్టారు.
ఇక సెక్రటేరియట్‌లో మార్పులపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మాత్రం రచ్చరచ్చ చేస్తోంది. కేవలం వాస్తుదోషాల పేరుతో కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ దుబారా చేస్తోందని విమర్శిస్తోంది. కేవలం కేసీఆర్‌పై అక్కసుతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. పాలన చేతకాక ముఖ్యమంత్రి రేవంత్ ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం అంతేధీటుగా జవాబిస్తోంది.
ఇక్కడ మరో వాదన సైతం లేకపోలేదు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ రేవంత్ ను ప్రతి అంశంలోనూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో రోజురోజుకు రేవంత్‌కు సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రికి సొంత పార్టీ నుంచి కూడా పదవి గండం ఉందనే ప్రచారం సైతం ఉంది. ప్రస్తుతమున్న స్థితిలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళితే పదవిగండం ఉందని తెలుస్తోంది. అందుకే సమస్యల పరిష్కారం కోసం గేట్లు మారుస్తున్నారనే చర్చ సైతం జరుగుతోంది.
KCR KTR Telangana Talli Telangana Talli Idol Telangana News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »
Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్.. అభివృద్ధిలో తగ్గేదేలే!Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..!
और पढो »
KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »
Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »
KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
और पढो »