Diwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
దీనికి కారణం అమెరికాలో సెప్టెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం పెరుగుదలపై ఒక్క సారిగా అంచనాలు వెలువడుతున్నాయి.బంగారం ధరలు దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పసిడి ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న మార్కెట్ పరిస్థితులే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరగుదలకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ ధరల పెంపునకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందనే వార్తలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో జరిగే ఫెడరల్ రిజర్వ్ భేటీలో కీలక వడ్డీ రేట్లు అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం మార్కెట్లో విపరీతమైన ధరల పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చైనా, జపాన్ వంటి సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తాయి.
ఇక ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తుందని వార్తలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు 72,000 సమీపంలో ఉండగా. త్వరలోనే 75,000 మార్కును తాకుతుందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. ట్రెండ్ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర త్వరలోనే రాబోయే దీపావళి నాటికి 80,000 రూపాయలు తాకడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా సూచనలు లభిస్తున్నాయి.
Gold Price For Diwali Gold-Silver Prices Diwali Diwali 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
और पढो »
Today Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్...బంగారం మళ్లీ పెరిగే చాన్స్..కారణాలు ఇవే..!!Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. శ్రావణమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత తగ్గుతుందని ఆశపడిన వారికి పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా షాకిస్తున్నాయి.
और पढो »
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్క రోజులోనే రూ. 250 వరకూ పతనం..శనివారం ధరలు ఇవేGold And Silver Rate Today: దేశంలో బంగారం ధర తగ్గింది. ఒక్కరోజులోనే రూ.250మేర పతనం అయ్యింది. నేడు శనివారం దేశంలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold and Silver Prices Today : వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?Gold Rate: దేశంలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 100తగ్గి..రూ. 70, 389 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,470 రూపాయలు పలుకుతోంది.
और पढो »
Gold Price History in India : ఆగస్టు 15, 1947న బంగారం ధరలు ఎలా ఉన్నాయి..తొలిసారి బంగారం ధర రూ. 1000 ఎప్పుడు దాటింది..?Gold Price History : మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 88 రూపాయలు ఉంది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. 1950వ సంవత్సరంలో తొలిసారిగా పది రూపాయలు పెరిగిన బంగారం ధర రూ. 99కి చేరింది.
और पढो »