Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి దర్శకత్వం వహించాల్సిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. ఈ విషయం మీద ఈ మధ్యనే నిర్మాత క్లారిటీ కూడా ఇచ్చారు.
Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన సినిమాలలో ఒకటి హరిహర వీరమల్లు. చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం కోసం అయినా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారు కానీ అది మాత్రం జరగటం లేదు. ఇదిలా ఉండగా తాజాగా సినిమాకి దర్శకత్వం వహించాల్సిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఎన్నికల హడావిడిలో ఈ విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు కానీ చాలామంది అభిమానులు మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం పై చిత్ర నిర్మాత ఏ.ఏం.రత్నం క్లారిటీ ఇచ్చారు. అందరికీ సర్దుబాటు కావాలనే ఉద్దేశంతో మాత్రమే క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారని తన బదులుగా జ్యోతి కృష్ణ.. ఇప్పుడు సినిమాకి దర్శకత్వం వహిస్తారని తెలియజేశారు. జ్యోతి కృష్ణ ఎవరో కాదు.. స్వయంగా ఏ ఏం రత్నం కొడుకే. ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే మీద బాగా పట్టు ఉండడం, స్వతహాగా తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ డైరెక్షన్లో అనుభవం ఉండటం వల్ల జ్యోతి కృష్ణ కి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా తాము ఇవ్వగలమని చెప్పుకొచ్చారు ఏ ఏం రత్నం. మొత్తానికి ఇలా క్రిష్ ఆ తర్వాత జ్యోతి కృష్ణ..ఎ.ఎం.రత్నం.. పవన్ కళ్యాణ్..
ఇదంతా బాగానే ఉంది కానీ సినిమా కథ, స్క్రీన్ ప్లే మీద పట్టు ఉండటం గురించి పక్కన పెడితే జ్యోతి కృష్ణ కి దర్శకత్వం మీద ఎంత పట్టు ఉందో ఎవరికీ తెలియదు. పోనీ ఏ.ఏం.రత్నం ట్రాక్ రికార్డు చూసినా కూడా మలయాళం సినిమా రీమేక్.. పెద్దరికం.. తప్ప పెద్ద చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ కూడా జానీ సినిమాతో డైరెక్టర్ గా ట్యాగ్ అయితే తెచ్చుకున్నారు.. కానీ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరి ఇలాంటి ఇద్దరు డైరెక్టర్లు, అసలు డైరెక్షన్ అనుభవమే లేని జ్యోతి కృష్ణ చేతిలో.. హరిహర వీరమల్లు సినిమా ఏమైపోతుందో అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ హడావిడిలో ఫ్యాన్స్ కి.. ఊరట కలిగించిన ఒకే ఒక్క విషయం సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది అని ఏ ఏం రత్నం నొక్కి చెప్పడం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీ అయిపోతారు. ఉన్న కాస్త సమయం కూడా ఓజీ సినిమా షూటింగ్ కి సరిపోతుంది.
Krish Pawan Kalyan Hari Hara Veera Mallu Hari Hara Veera Mallu Movie Director Hari Hara Veera Mallu New Director Jyoti Krishna
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికికట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
और पढो »
Fahadh Faasil: పుష్ప 2 విలన్ కు అరుదైన వ్యాధి.. ఆందోళనలో ఫ్యాన్స్.. దీని లక్షణాలు ఇవే..Pushpa 2 villain: పుష్ప సినిమా విలన్ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల ఏడీహెచ్డీ ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
और पढो »
Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
और पढो »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
और पढो »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »