Pushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటన కి గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ సినిమాకి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ పైన కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, ఇందులోని పాత్రలు ఎరా మారబోతున్నాయి అంటూ ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 1 లో కూడా శ్రీ వల్లి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న ను మరొకసారి వెండి తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అంటూ గతంలో రూమర్స్ వినిపించాయి కానీ చిత్ర బృందం మాత్రం వీటిపై రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ రష్మిక కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
"ఈ సినిమాలో నా పాత్ర చాలా చాలెంజింగ్ గా ఉంటుంది. మొదట పుష్ప సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అసలు సినిమా ఎలా ఉంటుంది, శ్రీవల్లి పాత్రను ఎలా చూపిస్తారు అనే విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర 2.0 వర్షన్ ని చూస్తారు" అని చెప్పింది ఈ నేషనల్ క్రష్ రష్మిక.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్ల పాత్రల మధ్య కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పనులతో చిత్ర బృందం బిజీ గా ఉంది. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాగే శ్రీవల్లి పాత్ర కొత్త పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Srivalli Srivalli Character In Pushpa 2 Srivalli Pushpa 2 Teaser Pushpa 2 The Rule
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »
बदल गई है Pushpa 2 की 'श्रीवल्ली', Rashmika Mandanna ने बताया उनके कैरेक्टर में हुआ क्या बदलावसाउथ सिनेमा के सुपरस्टार Allu Arjun अब पैन इंडिया स्टार बन चुके हैं। 2021 में रिलीज हुई पुष्पा द राइज से उन्होंने ग्लोबल स्टारडम हासिल किया। अब फैंस को इंतजार है तो बस पुष्पा द रूल का। फिल्म का झन्नाटेदार टीजर रिलीज होने के बाद फैंस की मूवी को लेकर एक्साइटमेंट बढ़ गई है। वहीं रश्मिका मंदाना ने बताया है कि इस बार फिल्म में क्या नया देखने को...
और पढो »
KCR Rajaiah Meet: కేసీఆర్‌కు బిగ్ బూస్ట్.. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన తాటికొండ రాజయ్యThatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
और पढो »
Lok Sabha Elections 2024: ఓటరు వేలికి పెట్టిన సిరా చుక్కా ఎందుకు చెరిగిపోదు.. ? ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..!Lok Sabha Elections 2024: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి 18వ లోక్ సభకు ఎన్నుకోవడానికి ఎన్నికల జరుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఓటరు వేలికి సిరా గుర్తును ఎందుకు చెరిగిపోదు.. ఇది ఎక్కడ తయారు చేస్తారనే విషయానికొస్తే..
और पढो »