Pushpa 2 Naa Saami: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెకండ్ లిరికల్ సాంగ్ ప్రోమో పుష్ప 2 నుంచి వచ్చేసింది. ఈ పాటలో సైతం నా సామి అంటూ రష్మిక ప్రేక్షకులను అలరించింది..
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా.. వస్తున్న పుష్ప 2 పైన ప్రపంచం మొత్తం ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఈ నెల మొదటి నుంచే సినిమా యూనిట్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్పను .. విడుదల చేశారు చిత్ర యూనిట్.
కాగా ఇప్పుడు రెండో లిరికల్ కూడా విడుదల చేయనున్నామని నిన్ననే తెలియజేశారు. కాగా ఇప్పుడు ఈ సెకండ్ లిరికల్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తూ.. ఈ ఫుల్ సాంగ్ లిరికల్ ఎప్పుడు విడుదల చేస్తాం అనే డేట్ కూడా బయటపెట్టేశారు. ఈ ప్రోమో కేశవ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది. ఓ శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి సెకండ్ లిరికల్ విడుదల చేస్తున్నారట కదా.. ఆ పాట ఏమిటో చెబుతావా..” అని పక్కా యాసలో.. మేకప్ వేసుకుంటున్న రష్మికను అడుగుతారు. వెంటనే రష్మిక .. “చూసేకి అతిరథ వల్లే ఉంటారు నా సామి”..
మొత్తానికి మరోసారి కూడా నా సామి అంటూ శ్రీవల్లి మెప్పించబోతోంది అని అర్థమైంది. కాగా ఈ పాటకు కింద కపుల్ సాంగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇక పుష్ప మొదటి భాగంలో నా సామి సాంగ్ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రపంచమంతా తెలుసు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్..రష్మిక స్టెప్పులు ఆ పాట కి హైలైట్ గా నిలిచాయి. చూస్తుంటే ఇప్పుడు రాబోయే ఈ పాట ఆ పాటను మించిపోయేలా అనిపిస్తోంది. మొత్తానికి మొదటి లైన్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నా సామి సాంగ్ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో తెలియాలి అంటే.. మే 29 వరకు వేచి చూడాలి.
Pushpa 2 Second Lyrical Pushpa 2 Couple Songs Pushpa 2 Promo Pushpa 2 Second Lyrical Promo
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
புஷ்பா 2 படத்தில் இருந்து அதிரடியாக வெளியாகியுள்ள முதல் சிங்கிள்!Pushpa Pushpa! The first single from Pushpa 2: சுகுமார் இயக்கத்தில் நடிகர் அல்லு அர்ஜூனின் ‘புஷ்பா2: தி ரூல் படத்தில் இருந்து புஷ்பா புஷ்பா முதல் சிங்கிள் வெளியாகியுள்ளது!
और पढो »
Pushpa Lyrical Song: అస్సలు తగ్గేదేలే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..
और पढो »
Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
और पढो »
Pushpa 2: అదిరిన పుష్ప 2 ఫస్ట్ లిరికల్ షార్ట్ వీడియో.. పూర్తి పాట విడుదల అప్పుడే..Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
और पढो »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »