Shahid Kapoor with Telugu Director: తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది హీరో హీరోయిన్లు హిందీలో కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో తెలుగు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈమధ్య హీరో హీరోయిన్లు మాత్రమే కాక టాలీవుడ్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. వెంటనే రన్బీర్ కపూర్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం కొట్టేసి యానిమల్ తో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సందీప్ వంగా ఇప్పుడు మిగతా తెలుగు డైరెక్టర్లకి ఇన్స్పిరేషన్ గా మారిపోయారు. మరోవైపు హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శైలేష్ కొలను అదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. బేబీ సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన సాయి రాజేష్ కూడా ఇప్పుడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇప్పట్లో ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజాగా ఇప్పుడు మరొక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ లో అడుగులు వేసి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఎవరో కాదు వంశీ పైడిపల్లి. ప్రభాస్ మున్నా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వంశీ పైడిపల్లి మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వారసుడు సినిమాతో అంతంత మాత్రం గానే అనిపించిన వంశీ పైడిపల్లి ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ని లైన్ లోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షాహిద్ కపూర్ కి కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించేసినట్లు సమాచారం. బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాలని తెలుగు డైరెక్టర్లు అనుకోవడంలో పెద్ద తప్పు ఏమీ లేకపోవచ్చు కానీ ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాని మాత్రమే ఆదరిస్తున్నారు.
పైగా ఓటీటీల పుణ్యమా అని చాలా వరకు సినిమాలు మిగతా భాషల్లో కూడా విడుదలవుతున్నాయి. కానీ టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం తమ హిట్ సినిమాలనే హిందీలో రీమేక్ చేస్తున్నారు. ప్రేక్షకులను నిరాశపరుస్తున్నారు. మరి రీమేక్ సినిమాలు కాకుండా వంశి పైడిపల్లి అయినా ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారో లేదో వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Vamshi Paidipally Director Vamsi Paidipally Shahid Kapoor With Telugu Director
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »
Rajamouli - SSMB 29: ఆ స్పెషల్ డే రోజున మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అఫిషియల్ ప్రకటన..Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
और पढो »
पत्नी Mira Rajput संग रेस्ट्रो से निकले तो पैपराजी पर भड़के Shahid Kapoor, बोले- प्लीज बंद करोShahid Kapoor: शाहिद कपूर डिनर डेट पर अपनी पत्नी मीरा राजपूत के साथ नजर आए तो पोज देने के बाद गाड़ी Watch video on ZeeNews Hindi
और पढो »
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
और पढो »
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
और पढो »
Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. కొత్త సినిమా మొదలు..Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.
और पढो »