Sunita Williams and Butch Wilmore Return to Earth Journey most dangerous part of last 46 minutes Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Sunita Williams Return Journey: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీ మరి కొద్దిగంటల్లో ముగియనుంది. స్పేస్‌ఎక్స్ నౌక భూ వాతావరణంలో ప్రవేశించాక చివరి 46 నిమిషాల సమయం అత్యంత ప్రమాదకరమైందిగా తెలుస్తోంది. అందుకే ఆనుక్షణం అప్రమత్తమౌతున్నారు.Tirumala news: తిరుమలకు వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. మార్చి 24 నుంచి బంపర్ అవకాశం.. స్టోరీ ఏంటంటే..?Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..
Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లో ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ కావాలని వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భూ వాతావరణంలో చివరి 46 నిమిషాల్లో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. 22 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటనలో భారతీయ వ్యోమగామి కల్పనా చావ్లా సహా ఏడుగురి దుర్మరణం కళ్ల ముందు మెదులుతోంది.
9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్షంలో వెళ్లిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఇద్దరినీ తీసుకుని తిరుగు ప్రయాణమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మార్చ్ 19 తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. దీనికోసం నాసా ఏడు ల్యాండింగ్ పాయింట్లు గుర్తించింది. ఇందులో మూడు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో, నాలుగు అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్నాయి.
అంతకు ముందు 1986 జనవరి 28వ తేదీన మరో స్పేస్ షటిల్ ఛాలెంజర్ లాంచ్ అయిన కాస్పేపటికి పేలిపోవడంతో అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది మరణించారు. ఈ రెండు ఘటనల నేపధ్యంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై అందరు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. క్షేమంగా ల్యాండ్ కావాలని ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి 46 నిమిషాల ప్రమాదకర సమయం ఎప్పుడు దాటుతుందా అని చూస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana: యువతకు బంపర్ గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.
Sunita Williams Butch Wilmore Sunita Williams Return To Earth Journey Last 46 Minutes Crucial Journey In Spacex Crew Dr