Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..

Telangana Bjp Chief समाचार

Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..
N Ramachandra RaoLoksabha Elections 2024Ts Polls Results 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.: అవును తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటల రాజేందర్ పేరు వినిపించింది. ఆయనే దాదాపు ఖాయమనే పేరు వచ్చింది. ఇప్పటికే ఈటల మల్కాజ్గిరి ఎంపికా గెలిచిన ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్ కు చోటు దక్కింది. దీంతో ఈటలకు నిరాశ తప్పలేదు.

ఈయన తెలంగాణలో బిజెపిలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ హై కమాండ్ అన్ని అంశాలను పనిలోకి తీసుకొని ఎన్ రామచంద్ర రావు పేరును బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి అగ్ర వర్గణ పార్టీ అనే పేరు ఉంది. ఇపుడిపుడే ఆ ముద్ర చెరిపేసుకుంటుంది. కానీ ఇప్పుడు సడెన్ గా తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న ఎన్. రామచంద్రరావు ఏ ప్రాతిపదికన ఎంపిక చేసారో చూడాలి. కేవలం పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు, మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసొచ్చే అంశాలు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈయన నియమితులైతే.. ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ఈ నేపథ్యంలో చివరి యేడాదిలో ఈటల లేదా డీకే అరుణ వంటి సీనియర్ నేతలకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టిఆర్ఎస్ నుంచి బిజెపికి వచ్చిన ఈటెలకు కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కొంత మంది సీనియర్ బీజేపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అటు డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా బయటి పార్టీల నుంచి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ ముగ్గురు కూడా బీజేపీ తరుపున తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఈ ఈక్వెషన్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ముందు నుంచి పార్టీలో ఉన్న రామచంద్ర రావు వైపు బిజెపి అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

N Ramachandra Rao Loksabha Elections 2024 Ts Polls Results 2024 BJP Party Pm Modi Malkajgiri

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇదే ఆయన ప్రొఫైల్Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇదే ఆయన ప్రొఫైల్Big Breaking news President Draupadi Murmu appointed Jishnudev Varma as Telangana new governor జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీ సీనియర్ నేతగా ఛారిలమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
और पढो »

Telangana BJP: తెలంగాణ బీజేపీ నోటికి తాళం వేసిందెవరు..?Telangana BJP: తెలంగాణ బీజేపీ నోటికి తాళం వేసిందెవరు..?Telangana BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి ..? భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి..! ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. ఆ నిశ్శబ్దదం వెనుక ఏదైనా సీక్రెట్ దాగి ఉందా..
और पढो »

Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
और पढो »

Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
और पढो »

Telangana Cabinet: రేషన్‌ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet: రేషన్‌ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »

Big Breaking News: తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుBig Breaking News: తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుBreaking News president Draupadi murmu issues orders of new governors for 9 states దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-16 11:36:35