India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!

India Us Trade Deal समाचार

India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!
IndiaAjit Doval Vs Marco Rubio MeetingUSA

India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.

8th Pay Commission Big News: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌షాక్.. ఈ 5 డిమాండ్స్ పరిష్కరించాల్సిందే..!అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వ్యవహరించిన తీరు ఇరుదేశాల మధ్య ఒప్పందానికి దారితీసిందని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది.సెప్టెంబరులో అజిత్ డోభాల్, యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో డోభాల్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. "ట్రంప్ ప్రభుత్వం లేదా ఆయన సలహాదారులు ఇచ్చే టారిఫ్ హెచ్చరికలకు భారత్ భయపడదు. గౌరవప్రదమైన ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికైనా మేము సిద్ధం" అని డోభాల్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీపై లేదా భారత విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని భారత్ స్పష్టం చేసింది.ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అంతకుముందు భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని విమర్శించిన ట్రంప్, ఆ తర్వాత శాంతించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. బహిరంగ విమర్శలు తగ్గడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ గాడిలో పడ్డాయి, ఇది చివరకు వాణిజ్య ఒప్పందానికి దారితీసింది. ఈ రహస్య చర్చలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ.."ప్రైవేటుగా జరిగిన దౌత్యపరమైన చర్చల వివరాలను వెల్లడించలేము" అని పేర్కొంది. అటు భారత ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.ఒకప్పుడు అమెరికా ఒత్తిడికి ఇతర దేశాలు లొంగిపోయేవి. కానీ, ఈ ఉదంతం ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో చర్చలు జరిపింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Pawan Kalyan: మందుబాబులకు భారీ శుభవార్త.. సమ్మర్ వేళ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. సంబరాల్లో లిక్కర్ రాయుళ్లు..Huge Anaconda Video: భారీ అనకొండ సాహసం.. అమాంతం మింగేస్తున్న దృశ్యం వైరల్ ఇవే.. చూస్తే షాక్ అవుతారు!Sun Transit 2026: ఫిబ్రవరి 13న మహా అద్భుతం.. ఈ 6 రాశులవారికి ధనవంతులు చేయబోతున్న సూర్య గ్రహం!Video Viral: నా కొచ్చిన గోస ఎవరికి రావొద్దు అయ్యప్పో.!. గుక్కపెట్టి ఏడుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Ajit Doval Vs Marco Rubio Meeting USA India-US Trade Deal Secrets Donald Trump Trump’S Tariff Threats To India Bloomberg Report On India's Stance

 

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

India-US Trade Deal: ট্রাম্প-মোদী বাণিজ্য চুক্তির জেরে ১০ গোল খেয়ে গেল চিন, বাংলাদেশ, পাকিস্তান! ভারত কীভাবে লাভবান...India-US Trade Deal: ট্রাম্প-মোদী বাণিজ্য চুক্তির জেরে ১০ গোল খেয়ে গেল চিন, বাংলাদেশ, পাকিস্তান! ভারত কীভাবে লাভবান...india US Trade Deal Gives India Advantage Over China Pakistan and Bangladesh
और पढो »

અમેરિકાના ખેડૂતોને માલામાલ કરશે ઈન્ડિયા સાથે ટ્રેડ ડીલ, US સચિવના દાવાએ ચોંકાવ્યા; જાણો ભારતે શું કહ્યું?અમેરિકાના ખેડૂતોને માલામાલ કરશે ઈન્ડિયા સાથે ટ્રેડ ડીલ, US સચિવના દાવાએ ચોંકાવ્યા; જાણો ભારતે શું કહ્યું?India-US Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલની જાહેરાત બાદ અમેરિકાના કૃષિ સચિવ બ્રુક રોલિન્સે નિવેદન આપ્યું છે કે, આ ટ્રેડ ડીલથી ભારતના બજારમાં અમેરિકાના કૃષિ ઉત્પાદનોના એક્સપોર્ટમાં વધારો થવાની અપેક્ષા છે.
और पढो »

अमेरिकी ट्रेड डील पर सरकार का पहला बयान: गोयल बोले- इससे इंजीनियरिंग, टेक्सटाइल, मरीन गुड्स सेक्टर को फायदा...अमेरिकी ट्रेड डील पर सरकार का पहला बयान: गोयल बोले- इससे इंजीनियरिंग, टेक्सटाइल, मरीन गुड्स सेक्टर को फायदा...India US Trade Deal Briefing Update; Follow Commerce Minister Piyush Goyal, Donald Trump, PM Narendra Modi, India US Relations Latest News On Dainik Bhaskar.
और पढो »

DNA: ट्रंप ने भारत से टैरिफ हटाया, मुनीर क्यों रोया? Asim Munir। Trump। Tariff। World News। Zee NewsDNA: ट्रंप ने भारत से टैरिफ हटाया, मुनीर क्यों रोया? Asim Munir। Trump। Tariff। World News। Zee NewsDNA: Friends, Russias reaction suggests that the India-US trade deal hasnt affected it much. but Watch video on ZeeNews Hindi
और पढो »

राहुल बोले- अमेरिकी ट्रेड डील में PM पर प्रेशर: उन्होंने आपका खून-पसीना बेचा, पहली बार राष्ट्रपति के भाषण प...राहुल बोले- अमेरिकी ट्रेड डील में PM पर प्रेशर: उन्होंने आपका खून-पसीना बेचा, पहली बार राष्ट्रपति के भाषण प...India US trade deal Congress statement. PM Modi India US trade deal Congress statement MOGAMBO KHUSH HAI.
और पढो »

ભારત સ્વતંત્ર છે, તે કોઈપણ પાસેથી તેલ ખરીદી શકે છે, રશિયાએ ટ્રમ્પને આપ્યો સ્પષ્ટ શબ્દોમાં જવાબભારત સ્વતંત્ર છે, તે કોઈપણ પાસેથી તેલ ખરીદી શકે છે, રશિયાએ ટ્રમ્પને આપ્યો સ્પષ્ટ શબ્દોમાં જવાબIndia US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે.
और पढो »



Render Time: 2026-04-28 13:00:59