KT Rama Rao Sends Legal Notice To Konda Surekha: తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
8Th Pay Commission New Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని శుభవార్త.. DAతో పాటు జీతం, పెన్షన్ రూ.17 వేల పెంపు!సినీ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని.. హీరోయిన్ల విడాకులకు కారకుడిగా పేర్కొన్న సురేఖపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
'ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉంది. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగో నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
'ఆ వ్యాఖ్యలను కొండా సురేఖ వెంటనే వెనక్కి తీసుకోవాలి. దురుద్దేశపూర్వకంగా అబద్దాలు, అసత్యాలు మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు . భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Israel vs Iran: ఇజ్రాయిల్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఇరాన్ ఇంటెలిజెన్స్ బాసే ఇజ్రాయెల్ గూఢచారి అంటా.. వెలుగులోకి సంచలన విషయాలు
Konda Surekha Samantha Naga Chaitanya Divorce Legal Notice Samantha Divorce Naga Chaitanya Samantha Divorce Issue Akkineni Nagarjuna
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్ సంచలన ప్రకటనKTR Perform Palabhishekam To Telangana Talli Statue: రాజీవ్ గాంధీ విగ్రహం తప్పక తొలగిస్తామని.. తమను ఎవరూ ఆపలేరని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. గణేశ్ నిమజ్జనం సాక్షిగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
और पढो »
Konda Surekha: నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్.. డ్రగ్స్‌కు అలవాటు పడి..: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..Konda Surekha Fires On KTR: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా మరోవైపు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు. తాజాగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
और पढो »
KTR Harish Rao: కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు? ఒకే వేదిక పంచుకోని నేతలుClashes Between KTR And Harish Rao What Is Going: గులాబీ పార్టీకి రెండు కండ్లుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు మధ్య విభేదాలు నెలకొన్నాయా? వారిద్దరి మధ్య చెడిందా? అని హాట్ టాపిక్‌గా మారింది.
और पढो »
Ex Minister KTR: హైడ్రాపై కేటీఆర్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
और पढो »
KTR School: అమ్మమ్మ ఊరిలో కేటీఆర్ సందడి.. అవ్వతాతను తలచుకుని భావోద్వేగంKT Rama Rao Emotional: రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో తన అమ్మమ్మ - తాత జోగినపల్లి లక్ష్మీ - కేశవరావు జ్ఞాపకార్థం కేటీఆర్ తన సొంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించారు. గురువారం భవనాన్ని ప్రారంభించి అమ్మమ్మ ఊరిలో సందడి చేశారు. ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాల్లో కేటీఆర్ తడిసి ముద్దయ్యారు.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »