రాచకొండ పోలీసులు కొత్త సంవత్సర వేడుకలకు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజలకు సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్ వేడుకలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు.కాల గర్భంలో మరో సంవత్సరం కలిసిపోనుండడం.. కొత్త సంవత్సరం వస్తుండడంతో భారీగా ప్రణాళికలు వేసుకుంటున్న ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన విడుదల చేశారు.
వాటిలో అనేక విషయాలపై ఆంక్షలు విధించడంతో ప్రజలు విస్తుపోతున్నారు.సంతోషంగా.. ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని.. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కమిషనర్ దిశానిర్దేశం చేశారు. రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విజ్ఞపతి చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. డ్రగ్స్, మద్యం విక్రయాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి విషయాలపై కీలక సూచనలు చేశారు. ఈవెంట్‌లో టపాసులు, మందుగుండు సామగ్రి అనుమతించవద్దని నిర్వాహకులకు సూచించారు. రోడ్డు భద్రత, ఈవ్ టీజింగ్‌ల నివారణ, బాంబుదాడుల నిరోధం, సంఘ వ్యతిరేక చర్యలను నిరోధించడంపై దృష్టి సారించి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీమ్‌లు ఈవెంట్‌లకు హాజరవ్వాలని, ఈవ్-టీజర్‌లపై నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. 'ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. ట్రాఫిక్ పోలీసు సూచనలకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎక్సైజ్ చట్టం ప్రకారం మైనర్లకు మద్యం అందించకూడదు. ఉల్లంఘించే వారి మీద సరఫరాదారుతో సహా నిర్వాహకులపై సంబంధిత కేసులు నమోదు చేస్తాం' అని కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు
POLICE RULES NEW YEAR CELEBRATIONS RAICHAKONDA DRUGS ALCOHOL OUTDOOR EVENTS SAFETY MEASURES
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
और पढो »
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట: రాచకొండ పోలీసులు చర్యలుఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ హైదరాబాద్ లో ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డుపై రూ.25,000 నోట్ల కట్ట పారవేసి డబ్బు కోసం వేట అనే చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌కు ఊహించని స్పందన లభించి, ప్రమాదాలకు దారితీస్తుందని నెటిజన్ల విమర్శలు ఉయ్యేగా మోసం చేస్తుందని పోలీసులు నమోదు చేయడం
और पढो »
Anmol Bishnoi Arrest: లండన్ లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అరెస్ట్..Anmol Bishnoi Arrest:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అన్మోల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
और पढो »
Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »
LPG Gas Cylinder: సామాన్యులకు బిగ్ షాక్.. మరోసారి గ్యాస్ ధరల పెంపు, కొత్త ధరలు ఇవే..LPG Gas Cylinder Price Hike: చివరి నెల మొదటి రోజు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. రూ.16 గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో వరుసగా మరోసారి గ్యాస్ ధరలను పెంచినట్లయింది.
और पढो »
Roja Selvamani: మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Police case filed on roja selvamani: మాజీ మంత్రి రోజాకు మరో బిగ్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా మూడో టౌన్ పొలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »