Congress vs BRS: బీఆర్ఎస్ అధినాయకత్వమే టార్గెట్‌గా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా..? బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు తెరపైకి ఆపరేషన్ టాప్ 3నీ కాంగ్రెస్ తెరపైకి తెస్తుందా..? గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ఆపరేషన్ టాప్ 3నీ బలపరుస్తున్నాయా..
? అసలు రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిన ఆ టాప్ 3 ఎవరు..? రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా...?బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో గత వారం పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపూ ఇప్పుడు విచారణ వేగవంతం చేసింది.
ఇక మరో ముఖ్య అంశం ఏంటంలే గత నాలుగైదు రోజులుగా మరో రెండు కీలక అంశాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ స్టార్ చేసింది. ఇప్పటికే ఈ రెండు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరుపుతుంది. జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.
ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్, విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్, కాళేశ్వరం అంశంలో హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ కీలక నేతలను ఒకే సారి కేసులో ఇరికించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తుందా అన్న చర్చ బాగా వినిపిస్తుంది. ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ ముగ్గురు నేతలపై కేసులు నమోదు అవుతాయని ప్రచారం కావడం మాత్రం రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఇక కేసీఆర్ , హరీష్ రావులపై కూడా కేసులు నమోదు కాబోతున్నాయా అనే సందేహాలు బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతున్నాయి.
KCR KTR Harish Rao Brs Congress Formula E Race Kaleshwaram Power Purchases Telangana Politics Telangana Latest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BRS Party Meet: రేవంత్ రెడ్డి వైఫల్యాలు ప్రజల ముందుంచాలి: పార్టీ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశంEx CM KCR Guided To BRS Legislative Party On Assembly Winter Session: అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. తన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు.
और पढो »
BRS Party: ఏడాదైనా పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టి ఎత్తలేదుSingireddy Niranjan Reddy Slams To Revanth Reddy:ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రైతు పండుగ పేరిట నిర్వహించిన సభ అది రైతులకు బెదిరింపు సభలాగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణRevanth Reddy Back Step Gautam Adani Rs 100 Cr Donation: గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
और पढो »
Harish Rao: హరీష్ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..?
और पढो »
K Kavitha: రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించు: ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిMLC Kavitha Meet Wankhidi School Students: విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. విద్యార్థులు అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »
KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనంKT Rama Rao Condemns Lagacharla Farmer Hand Cuffs: లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వాడని.. అమానవీయ ప్రభుత్వం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »