KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఛీప్ మాజీ సీఎం అసెంబ్లీకి వస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!7th Pay CommissionKCR In Assembly: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యేడాది పాలన పూర్తైయిన సందర్బంగా ప్రజా పాలన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
మరోవైపు గత ఏడాది కాలంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరు కానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాలు పన్నుతోంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ చార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.. ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ROR 2024 చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్‌వోఆర్–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించనుంది. మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, జెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చి విలువైన సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Revanth Reddy KCR Vs Revanth Reddy Telangana Assembly Sessions Assembly Sessions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KCR in Assembly: అసెంబ్లీకి కేసీఆర్..! ఎమ్మెల్యేలతో కీలక మీటింగ్..KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో జారీ పడి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కోలుకొని తిరిగి మాములు స్థితిక వచ్చారు. అయితే..
और पढो »
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »
EX CM KCR: కేసీఆర్ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్!Kcr back to Assembly: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ ఎంట్రీపై సస్పెన్స్ నడుస్తోంది. కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా గులాబీ బాస్.. ఇప్పుడైనా బయటకు వస్తారా..! లేదంటే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారా అనే చర్చ జరుగుతోంది. ఈనెల 9 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
और पढो »
KCR Movie: కేసీఆర్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్ హిట్ కావాలిKeshava Chandra Ramavath Movie Harish Rao Speech: ఉద్యమంతోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ సూపర్ హిట్ పాలన మాదిరి.. కేసీఆర్ సినిమా సూపర్‌హిట్ కావాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆకాంక్షించారు.
और पढो »
KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలుKCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.
और पढो »
AR Rahman divorce: తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన ఏఆర్ రెహమాన్ పిల్లలు.. ఏమన్నారంటే..?Ar Rahman childrens: ఏఆర్ రెహమాన్ పిల్లలు తమ తల్లిదండ్రుల విడాకులు అంశంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది.
और पढो »