Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
అయితే ముంబై పోలీసులు కూడా ఈ కార్ మీద.. ఆసక్తి చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. భారీ స్టార్ క్యాస్ట్ తో జూన్ 27న భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి..అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్న భైరవ పాత్రను, రోబోటిక్ కార్ బుజ్జి పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ. ఒక చిన్న వెబ్ సిరీస్ ని.. కూడా విడుదల చేశారు. ఇప్పటికే అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
తాజాగా ఇప్పుడు అందులో చూపించిన రోబోటిక్ కార్ బుజ్జిని రియల్ గా తీసుకొని వచ్చి.. ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో హల్చల్ చేసిన ఈ కార్ ఇప్పుడు ముంబైలోని.. జూహూ బీచ్ లో ఉంది. బాలీవుడ్లో కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ముంబైలో కూడా బుజ్జి క్రేజ్ భారీగానే ఉంది. తాజాగా బుజ్జి కార్ ఎక్కి.. ముంబై పోలీస్ ఆఫీసర్ ఒకరు ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ముంబై పోలీసుల చేతికి చిక్కిన బుజ్జి అంటూ ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం మారు మృోగుతోంది.బుజ్జి కార్ ను డ్రైవ్ చేస్తూ ముంబై పోలీస్ నవ్వుతూ కనిపించారు. ప్రభాస్ తో పాటు బుజ్జి క్రేజ్ కూడా నార్త్ ఇండియాలో బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పైగా బుజ్జి పాత్రకి సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డంబింగ్ చెప్పారు.
ఇక దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్, దిశా పటాని, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Kalki 2898 AD Prabhas Kalki Bujji In Mumbai Kalki Car Kalki Bujji Car Expo Bujji And Bhairava
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki2898AD: పెళ్లి అందుకే చేసుకోలేదు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKalki2898AD pre-release event: కల్కి 2898 AD లోని బుజ్జిని నిన్న పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మరి రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
और पढो »
Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Instant Karma: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. చైన్ స్నాచర్స్ కు రోడ్డుమీద దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్..Karnal chain snatching: కర్నాల్ లో ఇద్దరు దొంగలు రోడ్డుమీద ఉన్న మహిళను వెంబడించారు. ఆమె మెడలో ఉన్న చైన్ మీద కన్నేశారు. ఇంతలో ఒక కేటుగాడు బైక్ మీద రెడీగా ఉన్నాడు. మరో దొంగ మహిళ మెడలో నుంచి చైన్ ను లాగేసి పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ మీద కూర్చున్నాడు.
और पढो »
Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
और पढो »
Rahul gandhi: ఎన్నికల ప్రచారంలో అపశృతి... రాహుల్ గాంధీకి తప్పిన పెనుప్రమాదం.. వీడియో వైరల్..Loksabha elections 2024: బీహర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Lucknow: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
और पढो »