Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అకౌంట్‌లో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే.. ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా..? అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్‌కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని చెప్పిన పవన్.. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని.. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో ఎలా నమోదైందని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని.. నిధులు ఎటు వెళ్లాయి..? ఏం చేశారో చెప్పాలని ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.70 కోట్ల అందించగా..
2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయని.. రూ.209 కోట్లు మేర ఖర్చు చేశారని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమేనని.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమన్నారు. ప్రధాని మోదీ మంచి ఉద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని.. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికి వదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని గత పాలకులపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే.. ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది..? అధికారులను నిలదీశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎక్కడికి మళ్లించారో..? ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియజేయాలని స్పష్టం చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Deputy CM Pawan Kalyan Swatchh Andhra Corporation Funds Pawan Kalyan News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
और पढो »
Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
और पढो »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
और पढो »
Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
और पढो »
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ.. నెక్ట్స్ టార్గెట్ ఇదే..!Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీ మొదలుపెట్టారు. తన శాఖల గురించి ఆయన మాట్లాడారు. జనసేన మూల సిద్ధాంతాలకు తన శాఖలు దగ్గరగా ఉన్నాయన్నారు.
और पढो »