Snake Cremation Like Human Last Rituals In AP: విషపూరితమైన తాచుపాముకు గ్రామస్తులు దహన సంస్కారాలు చేసిన వింత సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. మనిషికి చేసినట్టు పాముకు అంత్యక్రియలు జరిపించారు.
జీవచరాల్లో పాము విషపూరితమైనది. కానీ హిందూవులు పామును దేవతగా పూజిస్తుంటారు. అయినా కూడా పాము కాటు వేస్తుందనే భయంతో దానిని చంపేస్తుంటారు. కానీ ఏపీలోని ఒక గ్రామంలో మాత్రం పామును దైవంగా భావిస్తున్నారు. నాగదేవతగా పిలుచుకునే పాములంటే ఆ గ్రామస్తులకు ఎంతో భక్తి. ఈ క్రమంలో ఓ పాము చనిపోవడంతో గ్రామస్తులు ఆవేదన చెందారు. మనుషులకు చేసిన మాదిరి పాముకు అంత్యక్రియలు చేశారు. పూజలు చేసి.. పాడె కట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మేళంవారిమెరకలో జరిగింది.
Student Warn To Teacher: 'సార్ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్ పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో మంగళవారం తాచుపాము చనిపోయి కనిపించింది. ఇళ్ల పరిసరాల్లో పడి ఉన్న పామును గుర్తించిన గ్రామస్తులు పూజలు చేశారు. ఆ ప్రాంతంలో తాచుపామును దైవంగా భావిస్తుంటారు. పాముకు నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం కొబ్బరి మట్టను పాడెగా చేశారు. దానిపై పామును ఉంచి పసుపు కుంకుమ వేసి పూజలు చేశారు. పూలు సమర్పించి మొక్కారు.అనంతరం గ్రామస్తులంతా పాడెపై పామును ఊరేగించారు. ఒకచోట పాముకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఇలా చేయడంపై గ్రామస్తులు స్పందించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాము సంచరిస్తే ఇలాగే అంత్యక్రియలు చేపట్టారు. ఆ పాముకు దుర్గ గుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాముకు దహన సంస్కారాలు జరిపించారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సంచరించే ఏ జీవి చనిపోయినా అంత్యక్రియలు జరిపించడం శాస్త్రమని నాడు వైదిక కమిటీ సభ్యులు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Election Polling 2024
Snake Cremation Perupalem Melamvarimerika West Godavari District
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Weight Loss Surgery: ప్రాణం తీసిన అధిక బరువు శస్త్ర చికిత్స.. వయసు 26 ఏళ్లు బరువు 150 కిలోలుYouth Dies During Weight Loss Surgery: అధిక బరువు బాధపడుతున్న యువకుడు బరువు తగ్గేందుకు ఆపరేషన్‌కు వెళ్లగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
और पढो »
Canning: স্ত্রীকে সৎকারেরও অর্থ নেই, মৃতদেহ নিয়ে হুতাশ স্বামীর! সাহায্যের হাত বাড়ালেন পুলিস-স্থানীয় মানুষcanning news husband no money on wife cremation police locals gives hand of help
और पढो »
Snake Video: भयंकर गर्मी के बीच तरबूज की दुकान पर पहुंचा नागSnake Video, Pali News: तेज गर्मी (Summer) व उमस से सांप (Snake Videos) भी अपने बिल से बाहर निकलने Watch video on ZeeNews Hindi
और पढो »
Snake Video: घर के अंदर था खतरनाक सांप, बाहर निकाला तो... साइज देख कांप जाएगा करेजाSnake Video: सोशल मीडिया (Social Media) पर आपने सांप (Snake Videos) की एक से एक वीडियो देखी होगी. Watch video on ZeeNews Hindi
और पढो »
Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »