Kareena Kapoor Out from Yash Toxic: ఫిమేల్ డైరెక్టర్ గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. కరీనాకపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ తాజాగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. చిత్ర బృందం ఇప్పుడు ఆమె స్థానంలో..
మరొక ప్యాన్ ఇండియన్ నటి ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.కేజిఎఫ్ సినిమాతో.. ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు కన్నడ స్టార్ యష్. ప్రస్తుతం యశ్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించేందుకు.. బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ని రంగంలోకి దింపింది చిత్ర బృందం .
అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ కి పెద్ద షాక్ ఇస్తూ కరీనాకపూర్ ఈ సినిమా నుంచి వాక్ ఔట్ చేసిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాలో కరీనాకపూర్ యశ్ సోదరి పాత్రలో కనిపించాల్సింది. ఇద్దర్నీ వెండితెర పై చూడడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం తో పాటు ఫాన్స్ కి కూడా పెద్ద షాక్ ఇస్తూ.. కరీనాకపూర్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. కరీనా కపూర్ స్థానంలో ఇప్పుడు నయనతారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
హీరో సోదరి పాత్ర అయినప్పటికీ అది ఒక స్ట్రాంగ్ అమ్మాయి పాత్ర అని, నటనకి స్కోప్ కూడా ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అందుకే కరీనాకపూర్ తర్వాత మరొక ప్యాన్ ఇండియా హీరోయిన్ కోసం వెతికిన చిత్ర బృందం.. నయనతారను సంప్రదించిందట. కథతో పాటు పాత్ర కూడా బాగా నచ్చడంతో నయనతార కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
మరోవైపు కరీనా కపూర్ డేట్లు కుదరకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. వేరే సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న కరీనా కపూర్ యష్ సినిమా కోసం సమయం కేటాయించలేక.. చిత్ర బృందంతో చర్చించి సినిమా నుంచి వెనకడుగువేశారట. ఫెయిరీ టేల్ ఫర్ ది గ్రోన్ ఆప్స్ అనే ఆసక్తికరమైన టాగ్ లైన్ తో ఈ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కి సిద్ధం అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Nayanthara Upcoming Movie Nayanthara Toxic Yash
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
और पढो »
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »
Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
और पढो »
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
और पढो »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
और पढो »