Andhra Pradesh Deputy cm pawan Kalyan Warns Telugu Film Industry for not meeting him Pawan Kalyan Warning: ఓ వ్యక్తి గుణగణాల్ని గుర్తించాలంటే అధికారం ఇచ్చి చూడాలంటూ పెద్దలు. అప్పుడే మనిషిలోని నిజమైన అంతరంగం బయటపడుతుంది.
Pawan Kalyan Warning: పూటకో మాట, అవసరాన్ని బట్టి వ్యాఖ్యలు.ఇవే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నైజానికి నిదర్శనాలు. అధికారం లేనప్పుడు ఒకలా, వచ్చాక మరోలా మాట్లాడటం అతనికే చెల్లింది. అందుకే సినిమా పెద్దల గురించి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Pawan Kalyan Warning: పూటకో మాట, అవసరాన్ని బట్టి వ్యాఖ్యలు..ఇవే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నైజానికి నిదర్శనాలు. అధికారం లేనప్పుడు ఒకలా, వచ్చాక మరోలా మాట్లాడటం అతనికే చెల్లింది. అందుకే సినిమా పెద్దల గురించి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.Shani Dev: మే 26న శని, బుధ గ్రహాల కలయిక.. ఈ అరుదైన రాశుల వారు భోగభాగ్యాలను అనుభవించబోతున్నారు..Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. మే 25వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఇవే... ఎంత తగ్గింది అంటే? Pawan Kalyan Warning: ఓ వ్యక్తి గుణగణాల్ని గుర్తించాలంటే అధికారం ఇచ్చి చూడాలంటూ పెద్దలు. అప్పుడే మనిషిలోని నిజమైన అంతరంగం బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వెనుక అతనిలో అసంతృప్తి కంటే అహంకారమే ఎక్కువగా కన్పిస్తోందనే చర్చ విన్పిస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే వ్యాఖ్యల్ని ఇంకొకరు చేసుంటే ఇంతగా చర్చకు దారితీసేవి కావు. ఈ వ్యాఖ్యలు పవన్ చేయడం వల్లనే ఇప్పుడు విమర్శలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమను అవమానించారని, చెప్పడమే కాకుండా సినిమాలకు అనుమతులు, టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమై నీకు ఎందుకు అంత పగ, ఎందుకు వాళ్లను బెదిరిస్తున్నావంటూ జగన్ ను ఏకవచనంతో ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సినిమాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని పదే పదే వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు అధికారం చేతికొచ్చాక వైఖరి పూర్తిగా మారిపోయింది. తెలుగు చలన చిత్రం తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో మొత్తం చర్చకు తెరతీశారు. ఈ ప్రకటనలో ఆయనలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అసంతృప్తి కంటే అధికారం తెచ్చిన అహంకారం ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి.తెలుగు సినీ రంగంలోని ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని గౌరవించడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబును సినిమా సంఘాలు ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు అవకాశం లేదని, సంబంధిత విభాగాల ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాము. టికెట్ల అమ్మకాలు, పన్నుల వసూళ్ల మధ్య అంతరం అధ్యయనం చేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్ల పారిశుద్ధ్య పరిస్థితుల్ని స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షిస్తారు. తినుబండారాల ధరలు, మంచి నీటి సదుపాయం వంటి అంశాలపై ఫిర్యాదుల నేపధ్యంలో తూనికలు కొలతల శాఖ, ఫుడ్ ఇన్‌స్పెక్ఠర్లతో తనిఖీలు ఉంటాయి. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లోని మల్టీప్లెక్స్ టికెట్ ధరలు, ఫుడ్ ధరలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. నిజంగా ఈయన చేసిన ప్రకటన ప్రేక్షకుల హక్కుల కోసమే అయితే సినిమా ప్రముఖులు తనను లేదా చంద్రబాబును కలవలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది. సినిమా టికెట్లు, అనుమతుల విషయంలో ప్రభుత్వ జోక్యమేంటని గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవే అంశాల్ని ఎందుకు ప్రస్తావించారో సమాధానం చెప్పాల్సి ఉంది. తన సినిమా విడుదలకు అంతరాయం కల్గించే కుట్ర జరుగుతోందనే అనుమానంతో అధికారాన్ని చివరి అస్త్రంగా ఉపయోగించాలని భావించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చేసే విమర్శలు గతంలో వైసీపీపై చేసిన సంగతిని ఎలా మర్చిపోయారో ఆయనకే తెలియాలని పలువురు విమర్శిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kavitha Sensational Commnents
Tollywood Ap Government Pawan Kalyan Criticises On Tollywood Pawan Kalyan On Movie Tickets Pawan Kalyan On Sensational Comments
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసుకో..!Congress MP Chamala Kiran Kumar Reddy Sensational Comments On Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ముందు డ్యాన్స్‌లు చేసుకోవాలి.. ఆయనపై సినిమాలు తీయాలని హితవు పలికారు.
और पढो »
Pawan Kalyan: ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనలో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అడుగడున అవమానించేలా ప్రవర్తిస్తోంది. దీనికి సంబంధించిన జనసేన, టీడీపీ నేతల మధ్య సోషల్ మీడియా వార్ జరగుతోంది.
और पढो »
Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్..Pawan kalyan honored nurses: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజక వర్గానికి చెందినఎనిమిది మంది స్టాఫ్ నర్సులను పవన్ కళ్యాన్ ఘనంగా సత్కరించారు. వైద్యరంగంలో వీరి సేవలు అమూల్యమైనవన్నారు.
और पढो »
Pawan kalyan Video: అభివృద్ధిని ఓర్వలేక పాక్ కుటిల పన్నాగాలు.!. తిరంగ ర్యాలీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Pawan kalyan in tiranga rally: ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో జరిగిన బీజేపీ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో పవన్ పాక్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
और पढो »
Pawan Kalyan Serious: నా సినిమానే ఆపుతారా? కాస్కోండి.. సినీ ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్Pawan Kalyan Serious Warning To Tollywood Producers: తనపై సినీ పరిశ్రమ చేస్తున్న కుట్రల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. అది ఎలా ఉంటుందో చూసుకోండి అంటూ సినీ పరిశ్రమకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
और पढो »
Pawan Serious: పవన్ వెనకాల ఆ నలుగురు పెద్ద కుట్ర..ఇచ్చిపడేసిన జనసేనాని..Pawan Serious On Tollywood : ఎవరినైతే గెలక్కూడదో వారిని గెలికారు ఇండస్ట్రీ పెద్దలు. పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనుకున్న సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ అదే రీతిలో వాయించి పడేసాడు.
और पढो »




