76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు

రాజకీయాలు समाचार

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు
గణతంత్ర దినోత్సవంఇండోనేషియాప్రోబోవో సుబియాంటో
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 107 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి కర్తవ్య పథ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 76వ గణతంత్య్ర వేడుకలు ఢిల్లీ లో కర్తవ్య పథ్ లో జరగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్ సభ స్పీకర్, హోం, రక్షణ సహా కేంద్ర క్యాబినేట్ మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వేడుకలను సజావుగా జరిగేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15 వేల మంది పోలీసులు మోహరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది. ప్రోబోవో సుబియాంటో భారత్‌లో పర్యటించిన తర్వాత పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు. ఈ కారణంగా, భారతదేశం ముఖ్య అతిథి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ప్రోబోవో సుబియాంటో తన భారత పర్యటన తర్వాత నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లాలని అనుకున్నారు. అందుకు భారత్ దౌత్య నీతి ప్రదర్శించడంతో సుబియాంటో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. మొదట తన భారత పర్యటనను పాక్ పర్యటనతో అనుసంధానం చేయాలనుకున్నారు. అప్పుడు భారతదేశం తన దౌత్యం అద్భుతాలను చూపించింది. దౌత్య మార్గాల ద్వారా ఇండోనేషియాతో భారత్ ఈ విషయాన్ని లేవనెత్తింది. భారత్ తన ఏ కార్యక్రమంలోనూ పాక్ బంధాన్ని కోరుకోవడం లేదని ఆయనకు వివరించి కన్విన్స్ చేసింది. దీంతో భారత పర్యటన అనంతరం నేరుగా మలేషియా వెళ్లనున్నారు. అక్కడ అతను యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్ సుల్తాన్ ఇబ్రహీం, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంలను కలుస్తారు. సుబియాంటో పర్యటన సందర్భంగా, పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు ఆయన కావడం విశేషం. 1950లో భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇండోనేషియా నుండి 352 మంది సభ్యుల కవాతు మరియు బ్యాండ్ బృందం ఇక్కడి డ్యూటీ లైన్‌లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంది. విదేశాల్లో జరిగే నేషనల్ డే పరేడ్‌లో ఇండోనేషియా కవాతు, బ్యాండ్ స్క్వాడ్‌లు పాల్గొనడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా భారత్-ఇండోనేషియా సంబంధాలు బలపడ్డాయి. ప్రధాని మోదీ 2018లో ఇండోనేషియాను సందర్శించారు. ఆ సమయంలో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకున్నాయి. గతేడాది నవంబర్ 19న రియో ​​డి జెనీరోలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సమావేశమయ్యారు. భారత్ – ఇండోనేషియా ఒక సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలం నాటి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలతో సన్నిహిత సముద్ర పొరుగు దేశాలుగా కొనసాగుతున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

గణతంత్ర దినోత్సవం ఇండోనేషియా ప్రోబోవో సుబియాంటో భారతదేశం ఢిల్లీ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

సంక్రాంతి సెలవులు: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్సంక్రాంతి సెలవులు: విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్శుక్రవారం నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.
और पढो »

Republic Day 2025: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. మీకోసం HD ఫొటోలుRepublic Day 2025: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. మీకోసం HD ఫొటోలుRepublic Day 2025 Wishes And Greetings For You And Your Friends: సామాన్యుడికి అధికారం చేరువ చేసేలా.. అధికారంలో ప్రజలను భాగస్వాములను చేసేలా భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. అంతటి గొప్ప రోజును గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్న సందర్భంగా మీరు.. మీ మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
और पढो »

హైదరాబాద్‌ డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేతహైదరాబాద్‌ డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేతకొత్త సంవత్సరం వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. పోలీసులు డిసెంబర్ 31స్ట్ నైట్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.
और पढो »

న్యూ ఇయర్‌ వేడుకలకు హైదరాబాద్‌లో Liquor Sales Timingsన్యూ ఇయర్‌ వేడుకలకు హైదరాబాద్‌లో Liquor Sales Timingsహైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. పోలీసులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో 4 పబ్బులకు అనుమతి ఇవ్వలేదు. డీజేకు అనుమతి 10 గంటల వరకు మాత్రమే ఇవ్వబింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్లు ఓపెన్‌లో ఉండనున్నాయి.
और पढो »

పీఎం కిసాన్‌ 19వ విడుత: పెళ్లికాని రైతులకు డబ్బులు పడతాయా?పీఎం కిసాన్‌ 19వ విడుత: పెళ్లికాని రైతులకు డబ్బులు పడతాయా?పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడుత డబ్బులు ఫిబ్రవరి మొదటివారంలో విడుదల కానున్నాయి. పెళ్లికాని రైతులకు డబ్బులు పడతాయా? అనే సందేహాలు కూడా ఉంది. ఈ పథకం వర్తిస్తున్న రైతుల వివరాలు ఇక్కడ.
और पढो »

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పుకేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పుతెలంగాణ అత్యున్నత న్యాయస్థానం ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది. ఈడీ కేటీఆర్ ను విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా, కేటీఆర్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు విచారణకి హాజరు కాకూడదని వాదించారు.
और पढो »



Render Time: 2025-02-13 14:55:05