Akiranandan: అకిరానందన్ పవన్ కళ్యాణ్ అబ్బాయిగా అందరికీ సుపరిచితుడే. మెగా కుటుంబంలో అసలు సిసలు ఆరడుగుల మించిన బుల్లెట్ అని చెప్పాలి. తాజాగా అతని సినీ ఎంట్రీకి సంబంధించిన బాధ్యతలను రామ్ చరణ్ తన భుజాన వేసుకున్నట్టు సమాచారం.
Akiranandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీని గద్దె దింపి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన అసలు సిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావడానికి కూడా కారకుడయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నిజమైన పవర్ స్టార్ గా నిలిచారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఎన్టీయే సమావేశానికి తనతో పాటు తన భార్య కుమారుడు అకిరానందన్ కలిసి ఢిల్లీ వెళ్లాడు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించినందరకు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మొత్తం వేడుకల్లో అందరి కళ్లు అకిరానందన్ పై పడ్డాయి. అంతేకాదు పవర్ స్టార్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎపుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అయితే అకిరానందన్ లాంఛింగ్ బాధ్యతలను రామ్ చరణ్ స్వీకరించినట్టు సమాచారం. ఈ మేరకు బాబాయికి హామి ఇచ్చాడు. ప్రస్తుతం తన సినిమాలు, రాజకీయాలతో పవన్ కళ్యాణ్ మరింత బిజీగా మారనున్నాడు.
ఈ నేపథ్యంలో అకిరానందన్ కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైయిన్ చేయించే బాధ్యతలను తీసుకోబోతున్నాడట. అంతేకాదు అకిరానందన్ లాంఛింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈ విషయమై కొంత మంది రచయతలు ఈ పని మీదే ఉన్నారట. 2026లో అకిరానందన్ హీరోగా గ్రాండ్ లాంఛింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Ram Charan Pawan Kalyan PM Narendra Modi Janasena Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్ దంపతులు..TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
और पढो »
NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
और पढो »
Prabhas: రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ గిఫ్ట్.. ఇంతకీ అదేమిటంటే..Kalaki 2898AD: తన తోటి నటులు అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ అలరిస్తూ ఉంటారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో రామ్ చరణ్ కూతురికి పంపించిన గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
और पढो »
Indian 2: ఇండియన్ 2 సంగతి సరే.. గేమ్ చేంజర్ సంగతి ఏంటి అంటున్న ఫ్యాన్స్Game Changer: శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 విడుదల తేదీని ప్రకటించగా.. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
और पढो »
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
NKR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్త సినిమాపై కళ్యాణ్ రామ్ బిగ్ అప్‌డేట్..Kalyan Ram - NKR: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల్లో డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాత సత్తా చూపెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ అమిగోస్, డెవిల్ మూవీలతో పలకరించిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో కొత్త సినిమాను తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
और पढो »