ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు, ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయకుంటే ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి.
AP Aarogyasri Services: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఆరోగ్య శ్రీతోపాటు ఈహెచ్ఎస్ సేవల్ని రేపట్నించి ఆపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Madhuri Dixit: లేటు వయసులో 'ఘాటు ప్రేమ'.. 69 ఏళ్ల వయసులో హీరోయిన్‌పై లవ్
AP Aarogyasri Services: ఏపీలో రేపట్నించి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తాయి, రేపు జనవరి 6 నుంచి అటు ఆరోగ్య శ్రీ, ఇటు ఈహెచ్ఎస్ రెండూ ఒకేసారి నిలిపివేస్తున్నట్టు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయకుంటే ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. రేపట్నించి ఇకపై ఈ రెండు సేవలు అందించలేమని స్పష్టం చేశాయి. బకాయిల భారాన్ని మోయలేకపోతున్నామని తెలిపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక 1500 కోట్ల బిల్లులు విడుదల చేసినా, ఇంకా 3 వేల కోట్ల బకాయిలున్నాయని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. తక్షణం బకాయిలు చెల్లించకుంటే ఆసుపత్రులు నడపలేమన్నారు.
వాస్తవానికి ఏపీలో ఆరోగ్యశ్రీ పధకాన్ని రీప్లేస్ చేసేందుకు కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శ్రీ పధకం స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని 1 కోటి 43 లక్షల కుటుంబాల్లో ఉన్న 4 కోట్ల 30 లక్షలమందికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయి.
2.5 లక్షల్లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలో మారేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇప్పటికే 5 లక్షల వరకూ వైద్య సేవలు అందుతున్నాయి. దీనిని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంలో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే పలు బీమా కంపెనీలు, ఆసుపత్రులతో చర్చలు జరిపింది ప్రభుత్వం. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
HEALTHCARE AAROGYASRI EHS HEALTH INSURANCE ANDHRA PRADESH
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Cabinet Meeting: ఏపీ క్యాబినేట్ మీటింగ్.. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై చర్చ..AP Cabinet Meeting: 2025 కొత్త యేడాదిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మీటింగ్ ఏపీలో రాబోయే నాలుగున్నరేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చుకు వచ్చే అవకాశాలున్నాయి.
और पढो »
ఏపీలో 7 కొత్త విమానాశ్రయాలు: చంద్రబాబు నిర్ణయంఏపీలో 7 కొత్త విమానాశ్రయాలు నిర్మించనుంది.
और पढो »
బంగాళాఖాతం అల్పపీడనం: ఏపీలో మోసం వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడనుంది. ఈ అల్పపీడనం వల్ల రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »
ఏపీకు మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లువందేభారత్ స్లీపర్ రైళ్లకు ఏపీలో మంచి డిమాండ్ ఉంది. విజయవాడ నుంచి అయోధ్యకు వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది.
और पढो »
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేMajor Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.
और पढो »
ఆరోగ్యశ్రీ పధకం అటకెక్కుతుందా?AP Health Insurance: ప్రతిష్ఠాత్మక ఆరోగ్యశ్రీ పధకం ఇక అటకెక్కినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై బీమా రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. నగదు రహిత చికిత్సలో భాగంగా హైబ్రిడ్ విధానం అమలు కానుంది.
और पढो »