AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు

AP Elections 2024 समाचार

AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు
Andhra Pradesh Elections 2024Election CommissionAp Election Arrangement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Andhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.

AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిHappy Mothers Day 2024: హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు, కోట్స్ ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి..

AP Election Arrangements: ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది ఉంటే పురుషులు 2 కోట్ల 3 లక్షల 39 వేల మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 5,26,010 మంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. మొత్తం 1 లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగించనున్నారు. 74 శాతం పోలింగ్ కేంద్రాల్లో అంటే 34,651 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

రాష్ట్రంలో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అదే రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో అయితే 4 గంటలకే పోలింగ్ ముగిసిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. 48 గంటల వరకూ మద్యం షాపులు, బార్లు మూతపడనున్నాయి. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండరాదు.

రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు పోటీ పడుతుంటే వీరిలో 417 మంది పురుషులు కాగా, 37 మంది మహిళలున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వీరిలో 2154 మంది పురుషులు కాగా, 231 మంది మహిళలున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh Elections 2024 Election Commission Ap Election Arrangement AP Elections Polling Date And Timings Electronic Voting Machines AP Voters List 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
और पढो »

Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »

Nominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులుNominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులుNomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచనున్నారు.
और पढो »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
और पढो »

AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టేAP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టేElection Commission likely to appoint dwaraka tirumalarao ఇక 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు సీబీఐలో గతంలో పనిచేశారు. ఇకత రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ సీపీగా, కోస్తాంధ్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పనిచేశారు.
और पढो »

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపుAP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపుAP Intermediate Board extends supplementary exams fee ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మార్చ్ 1 నుంచి 14 వరకూ జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి.
और पढो »



Render Time: 2025-02-16 14:07:03