Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది.
ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.అల్లు అర్జున్ వ్యవహారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ వారితో నిర్వహించిన సమావేశం చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కొంత మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నిర్మాతలు, దర్శకులు వదిలేస్తే అగ్ర సినీ నటులు గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది.ఈ సమావేశానికి సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబాలైన కొణిదెల, నందమూరి, ఘట్టమనేని కుటుంబాలు రాలేదు.
దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ కూడా రాలేదు.పరిశ్రమ నుంచి అక్కినేని నాగార్జున, వెంకటేశ్ మినహా పెద్ద నటులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. రామ్ పోతినేనికి ఆహ్వానం పంపినా అతడు కూడా సమావేశానికి డుమ్మా కొట్టాడు.గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే ఆహ్వానం పంపలేదా? లేదంటే ఆహ్వానం పంపినా సినీ ప్రముఖులు రాలేదా అనే సందేహాలు వస్తున్నాయి.
Nandamuri Family Mega Family Mahesh Babu Prabhas Vijay Deverakonda Konidala Family Manchu Family Ashwani Dutt Revanth Reddy Film Celebrities Meeting Hyderabad Telangana CM Revanth Reddy Film Industry Tollywood Telugu Cinema Telugu Film Celebrities
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mokshagna: ఎట్టకేలకు మొదలైన నందమూరి మోక్షజ్ఞ మూవీ.. కిర్రాక్ పుట్టిస్తున్న లుక్..Nandamuri Mokshagnya New Look: నందమూరి ఫ్యామిలీ నుంచి అది కూడా బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. తన ఏకైక పుత్ర రత్నాన్ని ఎంతో అట్టహాసంగా లాంచ్ చేస్తున్నారు.
और पढो »
2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్2024లో తెలుగు సినిమాలలో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.
और पढो »
Manchu Family: ఎవరు ఎవరిని కొట్టారు.. మంచు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది.. ?Manchu Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ వివాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సెలెంట వార్.... మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం రచ్చ..
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్ రావుHarish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్‌డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
और पढो »
Prabhas: బన్నీ ఇంటికి చేరుకున్న ప్రభాస్.. కల్కి తర్వాత మొదటిసారి ఇలా..!Prabhas meets bunny: అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ కూడా వచ్చారు.
और पढो »
మౌని అందాలు మతి పోగొడుతున్నాయినాగిన్‌లో అందరిని అలరించింది. ఎన్నో అవార్డులు దక్కించుకున్న మౌనీ రాయ్ చలికాలంలో కూడా వేడి పుట్టిస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
और पढो »