Congress Protest at ED Office: సెబీ చైర్‌పర్సన్ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ దేశ సంపదను దోచుకుంటున్నా.. బీఆర్‌స్ అనుకూలంగా ఉందని విమర్శించారు. జేపీసీపై బీఆర్ఎస్ విధానం స్పష్టం చేయాలన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. మీ తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరని సవాల్ విసిరారు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు చేస్తామని హెచ్చరించారు. ఎవడు తొలగిస్తాడో రావాలని.. తేదీ చెప్పాలని సవాల్ విసిరారు.
"అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55 వేల కోట్లు. పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15 వేల కోట్లు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. బ్యాంకుల జాతీయకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది.
దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి.. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే.. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది.. ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు..
వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీపై ఎందుకు మాట్లాడటం లేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం. జేపీసీపై బీఆర్ఎస్ విధానం స్పష్టం చేయాలి.." సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
CM Revanth Reddy News Brs BJP CM Revanth Reddy Fires On BRS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
और पढो »
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
और पढो »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
और पढो »
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »