Etela Rajender Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు కొడంగల్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు.
హామీల చర్చపై రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తున్నానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోడీ ఎందుకు అని.. తాము ఇక్కడే ఉన్నామని ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని.. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డిది తమ కొడంగల్ కాకపోయినా గెలిపించామని.. ఇప్పుడు తమను హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నానరి ఈటల అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని.. ఇంతలా ప్రజలను ఎవరూ హింసించలేదన్నారు. మూసీ పక్కన భూములు లాక్కిని.. కార్పొరేట్‌కు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు, లగచర్ల వంటి సంఘటనలు చోటు చేసుకుంటుండగా.. ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటోందని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీపై మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదని.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుందన్నారు. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారని అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. హామీల చర్చపై రేవంత్ రెడ్డి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని..
Central Bank of India: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయం.. కేంద్రం సంచలన నిర్ణయానికి కారణాలు ఇవే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా
Etela Rajender News MP Etela Rajender CM Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »
Kishan Reddy: రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌కు కిషన్ రెడ్డి సై.. రేపు మూసీ ఒడ్డున నిద్ర.. భోజనంKishan Reddy Sensation He Sleeping At Musi River Bed: అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని.. కానీ మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో అబద్దాలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »
Constable Row: కానిస్టేబుళ్ల భార్యల పోరాటానికి దిగి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంBattalion Constable Protest: పిల్లలతో సహా కానిస్టేబుళ్ల భార్యలు చేసిన ఉద్యమానికి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. సెలవుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
और पढो »
Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది.
और पढो »