Godavari floods Updates second warning in fore at dowlaiswaram barrage Godavari Floods: గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు ఉపనది శబరి పరివాహక ప్రాంతంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది అంతకంతకూ పెరుగుతోంది.
Godavari Floods : గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది.అటు భద్రాచలం ఇటు ధవళేశ్వరం రెండు చోట్లా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!
Godavari Floods: గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు ఉపనది శబరి పరివాహక ప్రాంతంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది అంతకంతకూ పెరుగుతోంది. పోటెత్తుతున్న శబరి నది అదుపు తప్పితే గోదావరికి మరింత వరద పొంచి ఉంటుంది. ఇప్పటికే లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాల కారణంగా గోదావరి నది వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 51 అడుగులకు చేరుకుని భయపెడుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో రెండు అడుగులు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఇక దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకుంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా తెరిచి 13 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నుంచి వాజేడు వెంకటాపురానిక వెళ్లే రహదారులు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపై తూర్పు బ్లాక్ వద్ద గోదావరి నీళ్లు చేరడంతో భద్రాచాలం నుంచి కూనవరం, చింతూరు, వీఆర్ పురం వెళ్లే రహదారి పూర్తిగా ఆగిపోయింది. ఇక శబరి నది ప్రవాహం పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరం కావచ్చు. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో పడవల్ని ఆశ్రయిస్తున్నారు. వరద మరింత పెరిగితే లంక గ్రామాల్లోకి నీరు చేరనుంది.
భద్రాచలం వద్ద మధ్యాహ్నానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావచ్చు. అయితే ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతుండటమే దీనికి కారణం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Dowlaiswaram Bhadrachalam Godavari Flood Level Second Warning At Dowlaiswaram Barrage Second Warning At Bhadrachalam Godavari Flood Increasing
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలుHeavy rains causes floods in godavari and krishna river here are the different dams water levels గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లోనూ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు.
और पढो »
Third Marriage: అదృష్టమంటే పండన్నదే.. భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఇద్దరు భార్యలుWives Done Third Marriage To His Husband In Alluri District: వేరే మహిళతో చనువుగా ఉంటేనే కాపురాలు కూలే ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు తమ భర్తకు మూడో పెళ్లి జరిపించిన ఆసక్తికర సంఘటన ఏపీలో జరిగింది.
और पढो »
IMD Heavy Rains Alert: దట్టమైన మేఘాలతో ఏపీ, తెలంగాణల్లో చీకటి, అతి భారీ వర్షాల హెచ్చరికAndhra Pradesh and Telangana weather forecast be alert imd issues orange and yellow alert heavy to severe heavy rains in ap ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలకు తోడు నైరుతి రుతు పవనాలుండటంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
और पढो »
Vijayashanthi: చంద్రబాబును నమ్మొద్దు.. మళ్లీ తెలంగాణ ఉద్యమిస్తుంది: విజయశాంతి హెచ్చరికVijayashanthi Sensational Comments On Chandrababu: తెలంగాణలో చంద్రబాబు పర్యటన అనుమానంగా ఉందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలనే విజయశాంతి పునరుద్ఘాటించారు. చంద్రబాబు స్వార్థానికి తెలంగాణలో పర్యటించారని ఆరోపించారు.
और पढो »
Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులుKrishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
और पढो »
CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
और पढो »