Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
: ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా అసలు సిసలు పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ పేరు మారు మోగిపోతుంది. మొన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇపుడు మంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ చేస్తోన్న సినిమాల పరిస్థితి ఏంటనేది సందిగ్ధంలో పడింది. ఈ యేడాది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి’ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు పూర్తైయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సినిమాను పూర్తి చేస్తారని అభిమానులు ఆశించారు.
ఈ నేపథ్యంలో మంత్రిగా ఆయన మరింత బిజీగా ఉండే అవకాశాలున్నాయి. ఇక పవన్ కూడా ఇప్పటికే షూట్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటనే విషయం కూడా డోలాయమానంలో పడింది. అయితే... పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీని ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా ఈ యేడాది రిలీజ్ అయ్యే పరిస్థితులు కనపడటం లేదు. ఆ డేట్ లో రిలీజ్ కావడం లేదనే విషయం పక్కా అని కన్ఫామ్ కావడంతో ఆ డేట్ లో ఇపుడు ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూసిన డేట్ లో ఎన్టీఆర్ సినిమా రావడంపై పవర్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ యేడాది పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ పార్ట్ 1 రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఇప్పటికే మొదటి పార్ట్ కు సంబంధించిన పవన్ కళ్యాణ్ షూటింగ్ సహా అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ రెండు కేటాయిస్తే డబ్బింగ్ పనులు కూడా పూర్తవుతాయి. దీంతో ఈ సినిమాను రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే తరువాయి అని చెబుతున్నారు.
దేవర విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మొత్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Devara New Release Date Devara Pawan Kalyan OG Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
और पढो »
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
Jr NTR: మావయ్య, బాబాయి, అత్తయ్య, పవన్ లకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా.
और पढो »
NKR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్త సినిమాపై కళ్యాణ్ రామ్ బిగ్ అప్‌డేట్..Kalyan Ram - NKR: కళ్యాణ్ రామ్ నందమూరి హీరోల్లో డిఫరెంట్ అని చెప్పాలి. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే నిర్మాత సత్తా చూపెడుతున్నాడు. లాస్ట్ ఇయర్ అమిగోస్, డెవిల్ మూవీలతో పలకరించిన కళ్యాణ్ రామ్.. తాజాగా మరో కొత్త సినిమాను తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
और पढो »
Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్
और पढो »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »