విశాల్ మెగా మార్ట్-మొబిక్విక్ షేర్లు స్టాక్ మార్కెట్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి.
విశాల్ మెగా మార్ట్-మొబిక్విక్ IPO : విశాల్ మెగా మార్ట్-మొబిక్విక్ షేర్లు స్టాక్ మార్కెట్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అదిరిపోయే ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి. విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ ఈరోజు దలాల్ స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు దాని IPO ధర రూ. 279 నుండి 58 శాతం కంటే ఎక్కువ జంప్‌తో లిస్ట్ అయ్యింది. కంపెనీ షేర్లు బిఎస్‌ఇలో 58.
51 శాతం పెరిగి రూ.442.25 వద్ద లిస్టయ్యాయి. తర్వాత 87.81 శాతం పెరిగి రూ.524కి చేరింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 57.70 శాతం జంప్‌తో రూ.440 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,435.68 కోట్లుగా ఉంది. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ IPO బిడ్డింగ్ చివరి రోజు శుక్రవారం 119.38 సార్లు సభ్యత్వం పొందింది. కంపెనీ రూ.572 కోట్ల ఐపీఓలో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.265-279గా ఉంది. ఇక విశాల్ మెగామార్ట్ ఐపీఓ షేర్లను ఈరోజు మార్కెట్లో నమోదు అయ్యాయి. ఎస్ఎస్ఈలో రూ. 104 వద్ద షేర్లు ప్రారంభం అయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ. 78 తో పోలిస్తే 33.33శాతం ప్రీమియంతో ఈ షేర్లు లిస్టయ్యాయి. రూ. 8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. 8000 కోట్ల రూపాయల ఈ ఇష్యూ 2024 సంవత్సరంలో నాల్గవ అతిపెద్ద IPO.విశాల్ మెగా మార్ట్ IPO పూర్తిగా OFS (ఆఫర్ ఫర్ సేల్) అయినప్పటికీ పెట్టుబడిదారుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా క్యూఐబి కేటగిరీ ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనబరిచి 85 సార్లు కంటే ఎక్కువ వేలం వేశారు. అయితే, OFSకి సంబంధించిన ఆందోళనల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుండి ఆసక్తి తక్కువగా ఉంది.భారతదేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, దిగువ-మధ్యతరగతి ఆదాయ సమూహం అవసరాలను తీర్చడంపై కంపెనీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. వ్యూహాత్మకంగా చొచ్చుకుపోని మార్కెట్లపై దృష్టి సారించింది. కంపెనీ తన వ్యాపార నమూనా సామర్థ్యంతో కస్టమర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది
IPO Vishal Mega Mart Mobikwik Stock Market Listing
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vishal Mega Mart IPO: నేడు విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ప్రారంభం..షేర్ ధరెంతంటే?Vishal Mega Mart IPO: విశాల్ మెగామార్ట్ ఐపీఓ నేటి నుంచి సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13న సబ్ స్క్రిప్షన్ ముగుస్తుంది. ఇన్వెస్టర్లు మూడు రోజుల పాటు బిడ్డింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ప్రారంభానికి ముందే ఈ ఐపీఓకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
और पढो »
Upcoming IPOs: ఒకే రోజు మూడు ఐపీఓలు..డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగా మార్ట్.రూ. 8వేల కోట్లు..ఒక్కో షేరుకు ఎంతంటే?Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
और पढो »
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ.. ఏం రాశారంటే..?Minister Nara Lokesh Letter: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
और पढो »
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగావేలంలో రికార్డ్ ధర, 26.75 కోట్లు పలికిన శ్రేయస్ అయ్యర్IPL 2025 Mega Auction Record level price for Shreyas Ayyar IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2025లో ఊహించినట్టే పోటాపోటీ వేలం జరుగుతోంది.
और पढो »
Nagababu: మెగా బ్రదర్ బంపరాఫర్.. కేబినెట్‌లో నాగబాబు శాఖ ఇదే!Janasena Politics: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కోలువుదీరాక.. ఒకే ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఆ పదవి కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. తాజాగా ఈ పోస్టును సీఎం చంద్రబాబు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
और पढो »
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ ఎవరికి, అందరి దృష్టి ఆ ఆటగాళ్లపైనేIPL 2025 Mega Auction All set ready who will get the jackpot in auction IPL 2025 Mega Auction: క్రికెట్ ప్రేమికులందరి దృష్టీ ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంపైనే పడింది. ఇవాళ, రేపు రెండ్రోజులు సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా జరగనున్న వేలంలో ఆటగాళ్లకు రికార్డు ధర పలికే అవకాశాలున్నాయి.
और पढो »