HMPV Virus In Hyderabad: హెచ్ఎంపీవీ వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే, మొదటగా కర్నాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. వీళ్లు ఎవ్వరూ అంతర్జాతీయంగా ట్రావెల్ చేయలేదు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 11 చైనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.చైనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మొదట కర్నాటకలో రెండు కేసులు బయటకు వచ్చాయి. ఈ నెల మూడో తేదీ టెస్ట్ చేయగా విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కానీ, ఐసీఎంఆర్ పలువురు నిపుణులు ఈ వైరస్ కొత్తది ఏం కాదు కరోనా వైరస్ వంటిది కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుంది అన్నారు. ఆ తర్వాత గుజరాత్, చెన్నైలో కూడా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు చైనాలో కూడా వైరస్ వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆసుపత్రులన్ని కిక్కిరిసి పోయాయి.
ముఖ్యంగా దాదాపు 229 మంది వరకు శ్వాసకోశ పరీక్షలు చేయించుకోగా ఈ విషయం బయటకు వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా 11 శాంపిల్స్ హెచ్‌ఎంపీవీ పాజిటివ్ వచ్చింది అని మణి మైక్రో బయాలజీ ల్యాబ్ తెలిపింది.ఇప్పటికే డిశ్చార్జీ అయ్యారని చెప్పింది. ఇది వరకు అందరూ చెప్పినట్లే ఈ వైరస్ కొత్తది ఏం కాదని ఎవరూ ఆందోళన చెందకూడదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, గత సంవత్సరం చివరి నెల నుంచి చాలామంది జలుబు, దగ్గు, సీజనల్ జబ్బులతో ఇక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయారు.
Hyderabad HMPV Cases China Virus Hyderabad HMPV Symptoms HMPV Outbreak China Virus In India HMPV Test Results
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
HMPV వైరస్: చిన్నారులకు అధిక వ్యాప్తిHMPV వైరస్ వ్యాప్తి చెందుతోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
और पढो »
HMPV: చైనా వైరస్ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం..!HMPV Virus Spread: చైనా వైరస్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్, చెన్నైలో కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
और पढो »
చైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్ వ్యాప్తితో ఆసుపత్రులు భారంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు జారీ చేసింది.
और पढो »
HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHmpv outbreak in china major concern to world what is hmpv how it spreads HMPV Symptoms: హెచ్‌ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమోనస్ వైరస్. కరోనా మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఇప్పుడు అదే దేశం నుంచి ముప్పుగా మారుతోంది.
और पढो »
HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదుHMPV Virus Threat and Precautions check here dos and donts HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ స్థూలంగా చెప్పాలంటే హెచ్ఎంపీవీ భయపెడుతోంది. కరోనా సంక్రమణ పూర్తయి ఐదేళ్లు కాగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది.
और पढो »
చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్: జాగ్రత్త చర్యలుహెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు, ముప్పు, జాగ్రత్త చర్యలు
और पढो »