ప్రముఖ తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి తర్వాత కట్నం కోసం అత్తింటి వేధింపులు, భర్త వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
తెలంగాణ జానపద పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ప్రముఖ గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న శృతి తాజాగా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అకాల మరణం చెందడంపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది శృతి . అయితే కట్నం కోసం అత్తింటి వారే ఆమెను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శృతి కి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది.
ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి అప్పటి నుంచి కట్నం కోసం అత్తింట్ వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతి వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే ఈ వేధింపులకు గురి కావడంతో తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
ఆత్మహత్య జానపద గాయని శృతి తెలంగాణ కట్నం వేధింపులు
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Telangana government brings new facial recognition attendance తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది.
और पढो »
శబరిమల ఆలయంలో భక్తుడు ఆత్మహత్యశబరిమల ఆలయంలో ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
और पढो »
KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. సంచలనంగా మారిన ప్రెస్ మీట్..ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
और पढो »
KCR In Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రచ్చ రచ్చే.. !KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.
और पढो »
Lagacharla: రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదుTelangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »
Telangana: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ.2,500 ఆరోజు జమా చేయనున్న ప్రభుత్వం..!Good News To Telangana Women: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అతి త్వరలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమా చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »